‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ – వర్మ !

Published on May 26, 2019 6:00 pm IST

మొత్తానికి రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద సినిమాలను అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాను ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. త్వరలోనే విజయవాడ మరియు అమరావతి ప్రాంతాల్లో ఈ సినిమా షూట్ జరుగుతుందని వర్మ పోస్ట్ లో తెలిపారు. టైటిల్ వింటేనే సినిమా ఎలా ఉండబోతుందో అర్ధమవుతుంది.

ఇప్పటికే ఏపీలో కులాలకు సంబంధించి ఎన్నో వివాదాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వర్మ కులం అనే అంశాన్నే హైలెట్ చేస్తూ సినిమా తియ్యాలనుకోవడంతో ఇది కూడా వివాదంగా మారే అవకాశం ఉంది.

మరో పక్క ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఏపీలో మే 31వ తేదీన విడుదల చేయబోతున్నామని రామ్ గోపాల్ వర్మ అధికారికంగా ప్రకటించారు. మరి ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఎలా ఆదరిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More