బాబు ఓడిపోయినా.. వర్మ వదిలేలా లేడు !

Published on May 26, 2019 5:07 pm IST

మొత్తానికి రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద సంఘటనలను అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతున్నాడు. రామ్ గోపాల్ వర్మ ఇటీవలే విజయవాడలోని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించి ఓ ప్రెస్‌ మీట్ పెట్టాలని ప్రయత్నిస్తే.. పోలీస్ యంత్రాంగం పెట్టనివ్వని సంగతి తెలిసిందే. అయితే తాజాగా వైసీపీ విజయంతో వర్మ గతంలో తాను ఎక్కడైతే మాజీ సీఎం ప్రెస్ మీట్ పెట్టనివ్వలేదో అదే విజయవాడలోని పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెడతానని ఛాలెంజ్ చేసాడు.

ఏది ఏమైనా సేమ్ అదే ప్లేస్ లో ప్రెస్ మీట్ పెట్టకపోయినా… మొత్తానికి విజయవాడలో అయితే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రెస్ మీట్ వర్మ తన పంతాన్ని నెరవేర్చుకున్నాడు. కాగా ఈ చిత్రం ఏపీలో మే 31వ తేదీన విడుదల కానుంది. ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రధానంగా బాబుని విలన్ గా చూపిస్తోంది. అసలకే ఓటమి బాధలో ఉన్న చంద్రబాబుకు వర్మ సినిమా కొత్త చికాకును తెప్పించేలా ఉంది. ఏమైన బాబు ఓడిపోయినా.. వర్మ వదిలేలా లేడు.

సంబంధిత సమాచారం :

More