
తన కెరీర్లో ఎప్పటికప్పుడు విభిన్న చిత్రాలు చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటి వరకూ వయోలెంట్ సినిమాలు, హర్రర్ సినిమాలు, యాక్షన్ ధ్రిల్లర్ అందించిన రామ్ గోపాల్ వర్మ తన కెరీర్లో మొదటి సారి పూర్తి రొమాంటిక్ లవ్ స్టొరీగా చేసిన సినిమా ‘365 డేస్’. నేటి తరం ప్రేమలు ఎలా ఉన్నాయి, ప్రేమకు ముందు ఒక జంట ఎలా ఉంటోంది – పెళ్లి తర్వాత అదే ప్రేమ జంట ఎలా ఉంటోంది అనే పాయింట్ ని బేస్ చేసుకొని చేసిన సినిమానే ‘365 డేస్’.
కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాని మే 15న రిలీజ్ చేయనున్నట్లు రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఒక వారం వాయిదా వేసారు. అనగా మే 22న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి నిర్ణయించుకున్నారు. నిఖిత శ్రీ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేష్ విలక్షణ – రామ్ గోపాల్ వర్మ కలిసి ఈ సినిమాని నిర్మించారు. నందు,అనైక సోతి జంటగా నటించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ తెచ్చుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాతో అన్నా రామ్ గోపాల్ వర్మ మళ్ళీ విజయాన్ని అందుకుంటాడు ఏమో చూడాలి..

