వాయిదా పడిన వర్మ కలల ప్రాజెక్ట్ !
Published on Mar 22, 2017 9:07 am IST


తన గత చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించకపోవడంతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు బాగా కలిసొచ్చిన, బోలెడంత క్రేజ్ తెచ్చిపెట్టిన సర్కార్ సిరీస్ లో మూడవ సినిమా చేశారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాను మొదట ఏప్రిల్ 7న తన పుట్టినరోజు నాడే రిలీజ్ చేస్తానని వర్మ చెప్పాడు. కానీ ప్రస్తుతం ఈ చిత్రం ఒక ఒక నెల వెనక్కు వెళ్ళింది.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో సినిమాను ఏప్రిల్ 7 నుండి మే 12 కు వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్ ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. దీంతో అమితాబ్ బచ్చన్, వర్మ అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. ఈ ప్లోటికల్ థ్రిల్లర్లో అమితాబ్ తో పాటు జాకీ ష్రాఫ్, మనోజ్ బాజ్పాయ్, యామీ గౌతమ్ లు నటిస్తున్నారు.

 
Like us on Facebook