షకీలా బయోపిక్ లో హీరోయిన్ కుదిరింది !
Published on Mar 7, 2018 6:01 pm IST

సిల్క్ స్మిత జీవితం ఆధారంగా విద్యా బాలన్ ప్రధాన పాత్రలో ‘డర్టీ పిక్చర్’ రూపొందిన బాలీవుడ్లోనే ఇప్పుడు మరొక ప్రముఖ నటి షకీలా బయోపిక్ కూడ రూపొందనుంది. 90ల దశకంలో పలు ఏ రేటెడ్ సినిమాల్లో నటించిన షకీలా మలయాళ పరిశ్రమలో తిరుగులేని స్టార్ డమ్ ను సొంతం చేసుకుని స్టార్ హీరోలకు ధీటుగా అభిమానుల్ని సంపాదించుకుంది.

అలాంటి ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు ఉన్నాయి. అందుకే ఆమె జీవితంపై సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు కన్నడ ఫిల్మ్ మేకర్ ఇంద్రజిత్ లంకేష్. ఈ చిత్రంలో షకీలా పాత్రను బాలీవుడ్ నటి రిచా చడ్డా పోషించనుంది. ఏప్రిల్ చివరి లేదా మార్చి మొదట్లో ఈ సినిమా మొదలుకానుంది.

 
Like us on Facebook