‘ఆర్ఆర్ఆర్’ నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ !

‘ఆర్ఆర్ఆర్’ నుండి ఇంట్రెస్టింగ్ పోస్టర్ !

Published on Jul 11, 2021 11:16 AM IST

క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ అంటూ జులై 15న ఉదయం 11 గంటలకు ఒక మేకింగ్ రాబోతుంది అంటూ తాజాగా చిత్రబృందం ఒక పోస్టర్ ను విడుదల చేసింది. మరి రాజమౌళి ఎలాంటి వీడియోని చేస్తాడో చూడాలి. ఇక కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు పోస్ట్ ఫోన్ అయిన షూటింగ్ ను ఇటీవలే స్టార్ట్ చేశారు. రామ్ చరణ్ పై కీలక సీన్స్ ను షూట్ చేశారు.

ఇక ఈ సినిమాలో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా నటిస్తున్నారు. అదేవిధంగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మొదటి సారి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి ఇండియా వైడ్ గా బజ్ ఉంది.

ఇక దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్యాన్‌ ఇండియా మూవీలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా అలాగే విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు