బాహుబలి కి ధీటుగా బాక్సాఫీస్ కి గురి పెడుతున్న “ఆర్ఆర్ఆర్”

Published on Jul 21, 2021 11:59 am IST

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలు గా నటిస్తున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. రాజమౌళి బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత విడుదల అవుతుండటం తో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే జక్కన్న ఈ చిత్రం కోసం కేవలం తెలుగు నటీనటులను మాత్రమే కాకుండా, బాలీవుడ్ మరియు హాలీవుడ్ కి చెందిన నటులను సైతం తీసుకున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్లు, వీడియో లు ఇప్పటికే విడుదల అయి సినిమా ఏ స్థాయిలో ఉండనుంది అనేది ఒక హింట్ ఇవ్వడం జరిగింది.

అయితే ఈ సినిమా లో ప్రతి పాత్రను కూడా జక్కన్న తీర్చి దిద్దినట్లు తెలుస్తోంది. బాలివుడ్ నుండి అలియా భట్, అజయ్ దేవగణ్ లు ఈ చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ లలో వీళ్ళు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే మెల్లగా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా పై మరింత ఆసక్తి నెలకొనే విధంగా ప్రమోషన్స్ షురూ చేయడం జరుగుతుంది. అయితే ఈ సినిమా కి సంబందించిన మేకింగ్ వీడియో సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది. మరొక పక్క ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లేదా టీజర్ త్వరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :