“ఆడవాళ్లు మీకు జోహార్లు” కోసం రాక్ స్టార్ దేవీ.!

Published on Jul 22, 2021 12:18 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ చిత్రం “ఆడవాళ్ళు మీకు జోహార్లు”. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం.

మరి మొన్ననే ఈ చిత్రం తాలూకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల. మరి ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ఈ ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్టుగా ఈ రోజు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించారు.

ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండ‌నున్నాయని, కిశోర్‌ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కిన్నారని. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి అసెట్ కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్న‌ ఈ సినిమాకు సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో శర్వానంద్, రష్మికా మందన్నా, సహా ‘వెన్నెల’ కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్‌ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్‌సీఎమ్‌ రాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :