బీచ్ లను వదలని పూరి, మళ్ళీ గోవాకి…!

Published on Nov 11, 2019 10:17 am IST

దర్శకుడు పూరీకి సముద్ర తీరాలకు మంచి అనుభందం ఉంది. ఆయన ప్రతి సినిమాలో కొన్ని సీన్స్ అలాగే కనీసం ఒక పాట సముద్ర తీరాన ఉంటాయి. పోకిరి సినిమాలో మహేష్,ఇలియానాల పై తెరకెక్కిన గల గల పారుతున్న గోదారిలా సాంగ్ ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. ఇక ఆయన తాజా హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ లోని కీలక సన్నివేశాలను మాల్దీవులలో తెరకెక్కించారు. కాగా పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ చిత్ర షూటింగ్ కూడా పూరి గోవాలో ప్లాన్ చేశారు.

అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జ‌రుగుతుంది. ర‌మ్య‌కృష్ణ స‌హా ఎంటైర్ యూనిట్ సభ్యులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. 30 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాలు, యాక్ష‌న్ సీన్స్‌, సాంగ్స్‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఈ ఇన్‌టెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ఫ‌స్ట్ లుక్‌ను రీసెంట్‌గా విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తుండ‌గా న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఇక పూరి సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చేస్తున్న ఫైటర్ మూవీ త్వరలో సెట్స్ పైకెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

More