‘రొమాంటిక్’గా సాంగ్ షూట్ చేస్తున్నారు !

Published on Nov 15, 2019 2:00 am IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న తాజా సినిమా ‘రొమాంటిక్’. కాగా నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గోవాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌ లో కీల‌క స‌న్నివేశాలతో పాటు సాంగ్స్‌ కూడా చిత్రీక‌రిస్తోన్నారు. కాగా ప్రస్తుతం హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

ఇక ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :