ట్రెండింగ్ లో రౌడీ బేబీ సాంగ్ !

Published on Jan 4, 2019 2:00 pm IST

తమిళ హీరో ధనుష్ నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘మారి 2’ ఇటీవల విడుదలై మిక్సడ్ టాక్ ను తెచ్చుకుంది. సూపర్ హిట్ మూవీ ‘మారి’ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇక ఈచిత్రం తెలుగులోను విడుదలై ఇక్కడ కూడా మిక్సడ్ టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం నుండి రౌడీ బేబీ అనే వీడియో సాంగ్ ను విడుదలచేశారు. ప్రస్తుతానికి ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రేండింగ్ లో కొనసాగుతుంది.

ఈ సాంగ్ విడుదలైన 45 గంటల్లో 11 మిలియన్ల వ్యూస్ ను అలాగే 4లక్షల పైచిలుకు లైక్స్ రాబట్టి కొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఈ సాంగ్ లో సాయి పల్లవి వేసిన స్టెప్స్ ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ సాంగ్ కు కొరియోగ్రఫీని అందించారు. బాలాజీ మోహన్ తెరకెక్కించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :

X
More