‘ఆర్ఆర్ఆర్’ కోసం ఆర్ఆర్ పూర్తయింది !

‘ఆర్ఆర్ఆర్’ కోసం ఆర్ఆర్ పూర్తయింది !

Published on Jan 4, 2021 11:11 PM IST

నేషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ అయిన టాకీ పార్ట్ కు సంబంధించిన సీన్స్ మొత్తానికి నేపథ్య సంగీతాన్ని కీరవాణి పూర్తీ చేశారని తెలుస్తోంది. కీ సీన్స్ కు సంబందించి ఇప్పటికే మెయిన్ బిజియమ్ ను ఎప్పుడో ఫినిష్ చేశారు. తాజాగా మిగిలిన సన్నివేశాలకు కూడా ఆర్ఆర్ ను పూర్తీ చేశారట.

అన్నట్టు ఈ సినిమాలో వచ్చే మెయిన్ ‘బిజియమ్ బీట్’ సినిమా మొత్తంలోనే హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. పైగా కీరవాణి కెరీర్ లోనే ఈ బిజియమ్ బిట్ బెస్ట్ అవుతుందట. ఇక రాజమౌళి ముందుగానే ప్రకటించినట్లుగా ‘ఆర్ఆర్ఆర్’ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం, చరణ్ అల్లూరి పాత్రల్లో కనిపించబోతున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

ఇక ‘బాహుబలి’ తరవాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో నెలకొన్నాయి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు