రిలీజ్ డేట్ ను చెప్పేసిన “RRR” నటి..వైరల్ అయిన పోస్ట్

Published on Jan 22, 2021 9:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం అన్నీ బాగుండి ఉంటే ఈ పాటికే ఇండియన్ బాక్సాఫీస్ ను వేటాడేసేది. కానీ మధ్యలో పరిస్థితులు ఒక్కసారిగా మారడంతో విడుదల చాలా దూరం వెళ్ళిపోయింది.

దీనితో ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ సినిమాలో బ్రిటిష్ లేడీ స్కాట్ గా నటిస్తున్న ఆంగ్ల నటి అలిసన్ డూడి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో RRR రిలీజ్ డేట్ అక్టోబర్ 8 న అన్నట్టుగా ఇటీవల మేకర్స్ పెట్టిన క్లైమాక్స్ షూట్ ఫోటో పెట్టి రివీల్ చేసేసింది.

అయితే ఇది ఎంతో సేపు ఉంచకుండా మళ్ళీ నార్మల్ ఫోటో పెట్టి పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె ముందు నిజంగానే రిలీజ్ డేట్ పోస్ట్ పెట్టినట్టుగా అభిమానులు సోషల్ మీడియాలో ఆ స్క్రీన్ షాట్ పట్టుకొని రచ్చ చేస్తున్నారు. దీనితో అది కాస్తా ఓ రేంజ్ వైరల్ అయ్యిపోతుంది. అయితే మేకర్స్ ఈ చిత్రాన్ని దసరా సీజన్లోనే విడుదల చేస్తారని బజ్ కూడా వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ మాత్రం మిస్టరీ గానే మిగిలింది.

సంబంధిత సమాచారం :

More