ఆర్ఆర్ఆర్ దోస్తీ మ్యూజిక్ వీడియో కి భారీ రెస్పాన్స్…10 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతుంది!

Published on Aug 1, 2021 6:51 pm IST


దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం దోస్తీ మ్యూజిక్ వీడియో ను ఉదయం 11 గంటలకు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పాట కి ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ పాట కోసం వివిధ భాషలకు చెందిన సంగీత దర్శకులు రంగం లోకి దిగారు. ఎం ఎం కీరవాణి ఆధ్వర్యం లో హేమ చంద్ర, అమిత్ త్రివేది, అనిరుద్, విజయ్ ఏసుదాస్, యాజిన్ నిజర్ లు కలిసి ఈ వీడియో చేయడం జరిగింది.

అయితే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ల అప్పియరెన్స్ ఈ పాట ను మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. అన్ని భాషల్లో సైతం ఈ పాట అత్యద్భుతంగా ఉండటం తో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ దోస్తీ వీడియో ప్రస్తుతం 10 మిలియన్ వ్యూస్ కి పైగా సొంతం చేసుకుంది. అయితే 24 గంటల్లో ఇంకెన్ని రికార్డుల అందుకుంటుందో చూడాలి.

ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. శ్రియ, అజయ్ దేవగన్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం లోని పాటలు టీ సిరీస్ మరియు లహరి మ్యూజిక్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ చిత్రం కి సంగీతం ఎం ఎం కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :