‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్ డేట్ !

‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jul 4, 2020 9:00 AM IST

రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం లాక్ డౌన్ లో కూడా రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా గడిపేశాడు. మెయిన్ గా కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ నేపథ్య సంగీతం పై కీరవాణి వర్క్ చేస్తున్నాడు. కాగా ఇప్పటికే ఈ చిత్రం మెయిన్ బిజియమ్ ను పూర్తి చేశాడట, కీలకమైన సన్నివేశాల్లో వచ్చే ఈ బిజియమ్ బిట్ సినిమా మొత్తంలోనే హైలైట్ గా నిలుస్తోందట.

అలాగే ఇప్పటివరకూ షూట్ చేసిన సీన్స్ ను ఎడిటర్ తమ్మిరాజు తన ఇంటిలోని ఎడిటింగ్ చేశారు. అవుట్ ఫుట్ విషయంలో రాజమౌళి పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు, తారక్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రచయిత సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్.. మెయిన్ గా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా బాగుంటాయట. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు