బాక్సాఫీస్ బ్లాస్ట్ : “RRR” మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు ఎంతంటే.!

బాక్సాఫీస్ బ్లాస్ట్ : “RRR” మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు ఎంతంటే.!

Published on Mar 26, 2022 5:06 PM IST

లేటెస్ట్ పాన్ ఇండియా బాక్సాఫీస్ సెన్సేషన్ “రౌద్రం రణం రుధిరం” ఊహించని రీతిలో మొదటి వసూళ్ళని అందుకొని బాక్సాఫీస్ వర్గాలను విస్మయానికి లోను చేసింది. ముఖ్యంగా ఫస్ట్ డే పలు చోట్ల కాస్త తక్కువే బుకింగ్స్ నమోదు అయ్యినా ఓవరాల్ గా మాత్రం మరోసారి తెలుగు సినిమా దెబ్బ బాక్సాఫీస్ కి రుచి చూపించింది.

చాలా కాలం తర్వాత ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమాగా నెవర్ బిఫోర్ ప్రమోషన్స్ తో వచ్చిన ఈ భారీ సినిమా మొదటి రోజు వసూళ్లపైనే అంతా దృష్టి పెట్టారు. ఈ సినిమా హైప్ ముందు సినిమాలను దాటేలా ఉంటుందా లేక తగ్గుతుందా అని అంతా అనుకున్నారు.

కానీ ఊహలకి కూడా అందని రేంజ్ లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరికొన్నాళ్లు ఏ ఇతర సినిమా కూడా అందుకోని స్థాయి వసూళ్లు అందుకొని బాక్సాఫీస్ బ్లాస్ట్ గా నిలిచింది. మరి టోటల్ గా అయితే ఈ చిత్రం అన్ని భాషల్లో కలుపుకొని 223 కోట్లు అందుకున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ఒక సాలిడ్ పోస్టర్ తో తెలిపారు. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లపై అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్టు అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు