“RRR” నుంచి ప్రతీ ఒక్కరికి గుర్తుండిపోయే గ్రాండ్ గిఫ్ట్ ఇది.!

“RRR” నుంచి ప్రతీ ఒక్కరికి గుర్తుండిపోయే గ్రాండ్ గిఫ్ట్ ఇది.!

Published on Aug 1, 2021 11:10 AM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అతి కొద్ది పాన్ ఇండియన్ చిత్రాల్లో దర్శకుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో ఇండియాలోనే తీసిన అతి పెద్ద మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. అయితే కథా పరంగా ఈ చిత్రంలో వారిద్దరూ స్వాతంత్ర సమరయోధుల పాత్రలు చేస్తున్నా దర్శకుడు మాత్రం వారిద్దరి నడుమ ఉన్న అద్భుతమైన స్నేహ బంధాన్ని చూపిస్తున్నానని ఇది ఎలాంటి స్వాతంత్య్ర సినిమా కాదని చెప్తూ వచ్చారు.

మరి తెలుగు నేలకి చెందిన ఆ ఇద్దరు యోధుల మధ్య స్నేహానికి ప్రతీకగా భారీ లెవెల్లో ప్లాన్ చేసిన పాటను ఇప్పుడు ఈరోజు ప్రపంచ స్నేహితుల దినోత్సవం కానుకగా విడుదల చేసేసారు.లెజెండరీ సంగీత దర్శకులు కీరవాణి సమకూర్చిన ఈ అద్భుతమైన ట్యూన్ గూస్ బంప్స్ ఇచ్చేలా ఉందని చెప్పాలి.

ముందు నుంచి టీజర్స్ లో ఇచ్చిన “దర దందం” ట్యూన్ తో స్నేహానికి ఉన్న ఎల్లలలను ఈ పాటలో అత్యద్భుతంగా సమకూర్చగా దానిని హేమచంద్ర ఆలపించారు. అలాగే అద్భుతమైన విజువల్స్ దానిని డిజైన్ చేసిన కొరియోగ్రఫీ చివరలో తారక్, చరణ్ ల ఎంట్రీ ఈ సాంగ్ ని విజువల్ గా ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది అని చెప్పాలి. మొత్తం ఐదు భాషల్లో చాలా ఫైనెస్ట్ సింగర్స్ తో ప్లాన్ చేసిన ఈ పాట నిజంగా ఈ స్నేహితుల దినోత్సవానికి గ్రాండ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ అని చెప్పాలి.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు