రిలీజ్ డేట్ పై “RRR” టీం సరైన అధికారిక క్లారిటీ.?

Published on Jul 17, 2021 7:00 am IST

ప్రస్తుతం టాలీవుడ్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మెగా మల్టీస్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ఫీవర్ నడుస్తుంది. ఇటీవలే వచ్చిన మేకింగ్ వీడియోతో ఈ సినిమా ఏ లెవెల్లో ఉండబోతోందో ప్రతీ ఒక్కరికీ ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో జక్కన్న మొదటి నుంచీ క్లారిటీగా ఉన్నారు. నిజానికి కరోనా కనుక రాకుండా ఉంటే ఎలాంటి డిలే లేకుండా రిలీజ్ చేసేసి ఉండేవారు.

అయినప్పటికీ ఇప్పుడు మాత్రం వచ్చే అక్టోబర్ 13 కి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ కొత్త రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేస్తూ వస్తున్న చిత్ర యూనిట్ మరో సారి ఒక ప్రెస్ మీట్ తో అధికారికంగా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ డేట్ తో సహా సినిమాపై మరిన్ని ఆసక్తికరమైన విషయాలు రాజమౌళి పంచుకొనున్నట్టు టాక్. అప్పటికి కనుక కరోనా కంట్రోల్ లో ఉండి అందరూ వాక్సిన్స్ వేసుకొని ఆరోగ్యంగా ఉంటే ఈ భారీ చిత్రాన్ని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..

సంబంధిత సమాచారం :