ఆమెతో నిర్విరామంగా “RRR” షూట్.!

Published on Jul 23, 2021 3:30 pm IST

ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకుని విడుదలకి సిద్ధం అవుతున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో “RRR” కూడా ఒకటి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అక్టోబర్ 13న రేస్ లో నిలపాలని చూస్తున్న దర్శకుడు రాజమౌళి ఇప్పుడు శరవేగంగా సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.

అయితే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ సహా ప్రమోషనల్ సాంగ్ లో బిజీగా ఉండగా ఈ చిత్ర యూనిట్ అంతా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పై షూటింగ్ తో బిజీ బిజీగా ఉన్నట్టు చెబుతున్నారు.. గత మూడు రోజులు నుంచి కూడా ఆలియా భట్ పైనే షూటింగ్ జరుపుతున్నట్టు తెలుస్తుంది.

నిన్న పార్ట్ పూర్తి చేసుకొని ఈరోజు కూడా ఎనర్జిటిక్ గా షూట్ లో పాల్గొన్నట్టు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో తెలిపారు. అయితే ఇది ప్రమోషనల్ సాంగ్ షూట్ అనే తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో తారక్ మరియు చరణ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :