లాస్ట్ షెడ్యూల్ కోసం ల్యాండ్ అయ్యిన “RRR” టీం.!

Published on Aug 3, 2021 10:00 am IST


ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా నిలిచి ఉన్న పలు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ మల్టీస్టారర్ కూడా ఒకటి. ఎనలేని అంచనాలు ప్రపంచ వ్యాప్తంగా నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా వచ్చిన “దోస్తీ” సాంగ్ ఇప్పుడు భారీ రెస్పాన్స్ ను కొల్లగొట్టి దూసుకెళ్తుండగా.. మేకర్స్ మరో కొత్త అప్డేట్ ని వదిలారు.

ఈ చిత్రంలోని లాస్ట్ షెడ్యూల్ నిమిత్తం ఉక్రెయిన్ లో ల్యాండ్ అయ్యినట్టుగా మేకర్స్ తెలిపారు. అంతే కాకుండా ఈ షూట్ పై చాలా ఎగ్జైటెడ్ గా కూడా ఉన్నామని ఒక వీడియో ద్వారా తెలిపారు. మరి ఈ షెడ్యూల్ లో ఎలాంటి సన్నివేశాలు తెరకెక్కించనున్నారో తెలియాల్సి ఉంది. మరి కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ వెచ్చించి నిర్మాణం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వచ్చే 13 అక్టోబర్ న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :