టోక్యో ఒలింపిక్స్ కోసం వెళ్తున్న భారత అథ్లెట్లకు “ఆర్ఆర్ఆర్” టీమ్ సపోర్ట్!

Published on Jul 22, 2021 11:53 am IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్లు సన్నాహం అవుతున్నారు. అయితే వారికి మద్దతు గా ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఒక గిఫ్ట్ ను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారి కోసం దారి సిద్దం చేద్దాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే అందుకు సంబంధించిన పోస్టర్ ను ఆర్ ఆర్ ఆర్ టీమ్ విడుదల చేసింది. వరుస ప్రమోషన్స్ తో చిత్ర యూనిట్ ఇప్పటికే బిజీ గా ఉంది. అయితే త్వరలో ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించిన టీజర్ లేదా ట్రైలర్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు కథానాయికలు గా నటిస్తున్నారు. ఈ చిత్రం లో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ను అక్టోబర్ 13 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :