తెలుగులో 100 మిలియన్ కొల్లగొట్టిన ‘RRR’ మాస్ సాంగ్.!

Published on Mar 19, 2022 9:00 am IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ఇద్దరు డాన్సింగ్ డైనమైట్స్ అందులోని మాస్ స్టార్స్ అయినటువంటి హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో ఎలాంటి సినిమా తీయాలో అలాంటి సినిమాని అదిరే ఎలిమెంట్స్ తో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసి పాన్ ఇండియా లెవెల్లో మరోసారి తెలుగు సినిమా ఖ్యాతి వేరే లెవెల్లో సెట్ చేశారు. ఆ సినిమానే “రౌద్రం రణం రుధిరం”.

మామూలుగానే ఈ ఇద్దరు హీరోల తాలూకా క్యాలిబర్ ఏంటో అందరికీ తెలిసిందే. పైగా రాజమౌళికి కూడా తన హీరోలని ఎలా వాడి థియేటర్స్ షేక్ చెయ్యాలో కూడా తెలుసు. మరి అలాంటిది తన మోస్ట్ ఫేవరెట్ అండ్ టాలెంటెడ్ హీరోలు ఇద్దరితో కలిపి సినిమా చేస్తే ఆ ట్రీట్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో మాస్ సాంగ్ “నాటు నాటు” తో చూపించారు.

ఓ పక్క రామ్ చరణ్ నుంచి కానీ ఎన్టీఆర్ నుంచి కానీ అలాగే రాజమౌళి సినిమాల్లో గాని సరైన మాస్ డాన్స్ లు చూసి అభిమానులకి చాలా కాలమే అయ్యిపోగా దాన్ని ఈ RRR లో చూపించేసారు. మరి ఈ సాంగ్ రిలీజ్ అయ్యి అన్ని భాషల్లో కూడా అదరగొట్టగా ఇప్పుడు ఒక్క తెలుగులో సెన్సేషనల్ 100 మిలియన్ మార్క్ ని ఈ సాంగ్ అందుకుంది. జస్ట్ లిరికల్ కే ఇలా ఉంటే రేపు థియేటర్స్ లో ఈ ఇద్దరి మూమెంట్స్ తో థియేటర్స్ లో చూస్తే మాత్రం దద్దరిల్లడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :