అన్నీ ఆల్ ఇండియన్ రికార్డులే సెట్ చేసిన “RRR”.!

Published on Jul 28, 2021 7:02 am IST


ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలతో సిద్ధంగా పాన్ ఇండియన్ చిత్రాల్లో దర్శక ధీరుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో తెరకెక్కిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మొత్తం ఐదు భాషల్లో ఎనలేని హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం రాజమౌళి ముందు సినిమా బాహుబలి 2 కంటే కూడా భారీ అంచనాలను దేశ వ్యాప్తంగా నెలకొల్పుకుంది.

ఒక్క అంచనాల పరంగానే కాకుండా ఇప్పటి వరకు కూడా ఈ సినిమాకి ఇండియన్ సినీ హిస్టరీ దగ్గర ప్రతీది ఆల్ టైం ఇండియన్ రికార్డే అని చెప్పాలి. నిన్న ఆడియో హక్కులు నుంచి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ స్ట్రీమింగ్, డిజిటల్ హక్కులు వరకు కూడా ప్రతిదీ భారీ స్థాయి బిజినెస్ ని జరుపుకొని ఆల్ టైం రికార్డులనే సెట్ చేసింది.

దీనిని బట్టి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి వచ్చే అక్టోబర్ 13 కే స్టిక్ అయ్యి ఉన్న ఈ చిత్రం విడుదల అయ్యాక ఎలాంటి రికార్డులను ఈ చిత్రం సెట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :