RRR మ్యూజిక్ రైట్స్‌ని దక్కించుకున్న టి-సిరీస్ మరియు లహరి మ్యూజిక్..!

RRR మ్యూజిక్ రైట్స్‌ని దక్కించుకున్న టి-సిరీస్ మరియు లహరి మ్యూజిక్..!

Published on Jul 26, 2021 7:48 PM IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే దాదాపు చివరి దశలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 13న రిలీజ్ కాబోతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా మ్యూజిక్ రైట్స్‌ని టి-సిరీస్ మరియు లహరి మ్యూజిక్ దక్కించుకున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో పూర్తి రైట్స్‌ని ఈ సంస్థలు దక్కించుకున్నాయి.

ఈ సందర్భంగా టి-సిరీస్ హెడ్ భూషణ్ కుమార్ స్పందిస్తూ “ఇది మేము భాగస్వామ్యం చేస్తున్న అతిపెద్ద చిత్రాలలో ఒకటి. వీక్షకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి యొక్క పనిని తాను ఎప్పుడు ఆరాధిస్తానని మరియు ఎంఎం కీరవాణి గారి సంగీతాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది విడుదల కానున్న అతిపెద్ద చిత్రం ఆర్ఆర్ఆర్ అని ఈ సినిమా సంగీతం అద్భుతంగా ఉంటుందని, ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నానని అన్నారు.

ఇక లహరి మ్యూజిక్ హెడ్ మనోహర్ నాయుడు కూడా దీనిపై స్పందిస్తూ “నేను గత 3 దశాబ్దాల నుండి ఎంఎం కీరవాణి గారి సంగీతాన్ని వ్యక్తిగతంగా ఆరాధించానని మరియు ఎస్ఎస్ రాజమౌలి యొక్క పనితీరును కూడా తాను మెచ్చుకుంటానని చెప్పుకొచ్చాడు. ఓ సంగీత ప్రేమికుడిగా చెబుతున్నా ఆర్ఆర్ఆర్ చిత్రేం సంగీతం అద్భుతంగా ఉందని, ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు