“ఆర్ ఆర్ ఆర్” తదుపరి షెడ్యూల్ కి సిద్ధమైన ఎన్టీఆర్ , చరణ్

Published on May 22, 2019 9:23 am IST

ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫిలిం మళ్లీ సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ మూవీ మూడవ షెడ్యూల్ని ఉత్తరభారతం లోని గుజరాత్, మహారాష్ట్రా లోని కొన్ని ప్రదేశాలలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ షెడ్యూలు చిత్ర్రీకరణలో చరణ్ , ఎన్టీఆర్ గాయాలపాలుకావడంతో షూటింగ్ కి కొంత విరామం ఇచ్చారు రాజమౌళి. ఇప్పుడు ఇద్దరు హీరోలు పూర్తి గా కోలుకోవడం తో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.

హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ కి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ చరణ్ లతో పాటు అలియా భట్ కూడా పాల్గొనబోతున్నారట. .చరణ్ కి జోడిగా అలియా నటిస్తుండగా, ఎన్టీఆర్ కుహీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారు రాజమౌళి అండ్ టీమ్.

ఇక “ఆర్ఆర్ఆర్” సినిమా టైటిల్ నిర్ణయించే బాధ్యతను ప్రేక్షకులకే వదిలేసిన సంగతి తెలిసిందే. చాలామంది పంపిన టైటిల్స్ నుండి “రామ రావణ రాజ్యం”, “రఘుపతి రాఘవ రాజారామ్” అనే టైటిల్స్ నుమాత్రం పరిగణలోకి తీసుకొని వీటిపై కసరత్తు చేస్తున్నారంట రాజమౌళి.

సంబంధిత సమాచారం :

More