ఆర్ ఆర్ ఆర్ విడుదల మరింత ఆలస్యం?

Published on Jul 5, 2020 9:16 am IST

ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల తేదీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ విడుదలపై అనేక రూమర్స్ ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతానికి 2021 జనవరి 8గా ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ ఉండగా అది సాధ్యం కాదని అర్థం అవుతుంది. దీనితో ఆర్ ఆర్ ఆర్ మరింత వెనక్కు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

కాగా ఆర్ ఆర్ ఆర్ విడుదల తేది ఇదేనంటూ మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రాన్ని 2021 జులై 30న విడుదల చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడని సమాచారం. అది కూడా మరో నెలా లేదా రెండు నెలలలో షూటింగ్ మొదలైతేనే సాధ్యం. లేదంటే ఆర్ ఆర్ ఆర్ విడుదల మరింత ఆలస్యం కావడం ఖాయం. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, చరణ్ అల్లూరి పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More