ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆ పనులలో ఫుల్ బిజీ.

Published on Apr 6, 2020 9:28 am IST

దేశంలో కరోనా కేసులు అతివేగంగా పెరుగుతూ పోతున్నాయి. ఇంకా లాక్ డౌన్ పూర్తి కావడానికి కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఇంకా పరిస్థితి క్లిష్టతరంగా మారుతూపోతుంది. అనేక రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వందల్లో ఉండగా అది దేశవ్యాప్తంగా వేలల్లోకి వెళ్ళింది. దీనితో లాక్ డౌన్ పొడిగించే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కూడా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది. గత నెలలో మొదలుకావాల్సిన పూణే షెడ్యూల్ నిలిచిపోయింది.

ఐతే ఆర్ ఆర్ ఆర్ టేం ఏమి ఖాళీగా లేరని సమాచారం. వచ్చే నెల మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కోవడంతో ఆయన ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేయనున్నారు. ఈ వీడియోని అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో జక్కన్న అండ్ టీమ్ తలమునకలై ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలలో బెస్ట్ సెలెక్ట్ చేసే, వారి కాన్సెప్ట్ కి తగ్గట్టుగా విజువల్ ట్రీట్ గా సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఈ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ వర్క్ దగ్గరుండి జక్కన్న కేర్ ఫుల్ గా చేయిస్తున్నాడట. ఇక ఇటీవల దానయ్య ఆర్ ఆర్ ఆర్ గ్రాఫిక్ వర్క్ జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి లాక్ డౌన్ సమయంలో రాజమౌళి ఈ కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

సంబంధిత సమాచారం :