ఈ కష్ట కాలంపై “RRR” టీం వినూత్న సందేశం.!

Published on May 6, 2021 3:01 pm IST

గత ఏడాది లాంటి రోజులు మళ్ళీ రాకూడదు అని సమస్త మానవాళి ఎంతో గాఢంగా కోరుకుంది కానీ అదే మనుషుల నిర్లక్ష్య ధోరణి వల్ల మళ్ళీ కరోనా విలయ తాండవడం చేయడం మొదలు పెట్టింది. దీనితో ఇప్పటికే అనేక మంది ఇతరుల కష్టాన్ని తమ కష్టంగా భావించి సాయం చేస్తున్నారు. అలాగే మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా అనేక పెద్ద నిర్మాణ సంస్థలు సహా చిత్ర యూనిట్స్ కూడా తమ వంతు సహాయం చైతన్యం అందిస్తున్నాయి.

వాటిలో ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “RRR” యూనిట్ కూడా ఒకటి. మరి ఇదిలా ఉండగా గత ఏడాది లోనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో అద్భుత సందేశాన్ని వారు అందించారు. కానీ ఈసారి మరింత వినూత్నంగా తారక్, చరణ్ లతో సహా బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవ్ గన్ లతో దర్శక ధీరుడు రాజమౌళి కూడా అద్భుత సందేశాన్ని మొత్తం దేశమంతటికీ ఒకేసారి ఇచ్చారు.

ఒక్కొక్కరూ ఒక్కో భాషలో ప్రస్తుత కష్ట కాలాన్ని విశదీకరిస్తూ ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి కలిసి కట్టుగా ధైర్యంగా నిలబడి కరోనాను అడ్డుకోవాలని కుదిరిన ప్రతీ ఒక్కరూ వాక్సిన్ వేయించుకొని మన కుటుంబీకులు, స్నేహితులు దేశాన్ని కాపాడుకోవాలని సందేశం ఇచ్చారు. మరి వారి సూచనలు తప్పకుండ ప్రతీ ఒక్కరూ పాటించి తిరిగి ఆరోగ్యకరమైన రోజులను మళ్ళీ తెచ్చుకోవాలని మాయా 123తెలుగు యూనిట్ కూడా ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం :