ఎన్టీఆర్ వాక్చాతుర్యం, చరణ్ వీరత్వం.. సర్ ప్రైజ్ అదిరిపోయింది !

Published on Mar 27, 2020 4:23 pm IST

నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చరణ్ కి ప్లాన్ చేసిన సర్ ప్రైజ్ గిఫ్ట్ పై వారిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఆ గిఫ్ట్ రాజమౌళి దగ్గరకి వెళ్లడం.. ఎట్టకేలకూ జక్కన్న ఈ సాయంత్రం 4 గంటలకు ట్విట్టర్ లో దాన్ని రివీల్ చేశారు. భీమ్ ఫర్ రామరాజు అంటూ వచ్చిన వీడియోలో.. చరణ్ పాత్రధారి ‘అల్లూరి’ గురించి గ్రాండ్ ఎలివేషన్స్ షాట్స్ అండ్ భారీ విజువల్స్ అలాగే చరణ్ యాక్షన్ స్టంట్స్ ముఖ్యంగా ఎన్టీఆర్ అద్భుత వాక్చాతుర్యం ‘ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది..ఇంటి పేరు అల్లూరిసాకింది గోదారినా అన్న…మన్నెం దొర… అల్లూరి సీతారామ రాజు’ అంటూ తారక్ పలికిన డైలాగ్స్ . అదిరిపోయాయి. రాజమౌళి ఈ వీడియోతో ఫ్యాన్స్ ఆసక్తిని ఇంకా డబుల్ రెట్టింపు చేస్తూ అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.

కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటులు.. ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే లేడి విలన్ గా ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై ఆరంభం నుండి భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో అత్యున్నత భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More