మరోసారి వెనక్కి వెళ్లనున్న అనుష్క ‘రుద్రమదేవి’

Rudhramadevi
భారీ చిత్రాల డైరెక్టర్ గుణశేఖర్ డ్రీం ప్రాజెక్ట్ మరియు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి తీసిన భారీ బడ్జెట్ పీరియాడికల్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనిపించుకున్న యోగ బ్యూటీ అనుష్క రుద్రమదేవి పాత్రలో కనిపించనుంది. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా రోజులుగా జరుగుతున్నాయి. హై టెక్నికల్ వాల్యూస్, గ్రాఫిక్స్ కి ఎక్కువ ఉన్న సినిమా కావడం వలన ఈ సినిమా రిలీజ్ చాలా సార్లు వాయిదా పడింది.

కానీ కొద్ది రోజుల క్రితమే ఎలాంటి మార్పు లేకుండా జూన్ 26న తెలుగు, తమిళ భాషల్లో సినిమాని రిలీజ్ చేస్తున్నామని ఈ చిత్ర టీం అనౌన్స్ చేసింది. కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం జూన్ 26న రుద్రమదేవి రిలీజ్ కావడం లేదు. దానికి కారణం ఈ సినిమాకి సంబందించిన 3డి వర్క్ ఇంకా పూర్తి కాలేదు. అది పూర్తవ్వడానికి ఇంకాస్త సమయం పడుతుందని ఈ సినిమాని వాయిదా వేసారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 3డి వర్క్ ని త్వరగా ఫినిష్ చేసి కుదిరితే జూన్ 30న సినిమాని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

రుద్రమదేవి కథలో కీలకమైన గోనగన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

Exit mobile version