చెన్నై బాక్సాఫీస్ వద్ద ‘రుద్రమదేవి’ టాప్ ప్లేస్!

చెన్నై బాక్సాఫీస్ వద్ద ‘రుద్రమదేవి’ టాప్ ప్లేస్!

Published on Oct 20, 2015 11:57 PM IST

rudramadevi
గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ అయిన రుద్రమదేవి సినిమా ఎన్నో అవాంతరాలను దాటుకొని అక్టోబర్ 9న తెలుగు, హిందీ, మళయాలం భాషల్లో భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. కాకతీయ సామ్రాజ్య వీరనారి రాణీ రుద్రమదేవి కథ కావడం, భారతదేశపు మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ సినిమా కావడం అనుష్క, అల్లు అర్జున్, రానా లాంటి భారీ తారాగణం నటించడం వంటి కారణాలతో సినిమాపై మొదట్నుంచీ విపరీతమైన అంచనాలు కనిపించాయి.

ఇక ఈ సినిమాపై ఇతర భాషల్లో కూడా ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగుతో పాటు హిందీ, మళయాలంలోనూ సినిమాను విడుదల చేశారు. కాగా తమిళంలో మాత్రం ఈ సినిమా ఒకవారం ఆలస్యంగా అంటే అక్టోబర్ 16న విడుదలైంది. థెండాల్ ఫిల్మ్స్ రుద్రమదేవి తమిళ వర్షన్‌ను విడుదల చేసింది. సుమారు 350 పైగా స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా మొదటివారాంతం మంచి ఓపెనింగ్స్‌నే తెచ్చుకుంది. ముఖ్యంగా చెన్నై బాక్సాఫీస్ వద్ద 80 లక్షల రూపాయలు వసూలు చేసి గత వారాంతం టాప్ ప్లేస్‌లో నిలిచింది. రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ తో పోలిస్తే రుద్రమదేవి చెన్నైలో రెట్టింపు బిజినెస్ చేసింది.

కాగా ఈ వారం హీరో విక్రమ్ నటించిన 10 ఎంద్రతుకుల్ల విడుదలవుతోన్న సందర్భంగా రుద్రమదేవి కలెక్షన్స్ రానున్న వారం సాధారణంగానే ఉండే అవకాశం ఉంది. దసరా సెలవులు మాత్రం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. తమిళంలో ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా, అనుష్క, అల్లు అర్జున్‌ల నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు