రూలర్ టీజర్ – బాలయ్య నట విశ్వ రూపం

Published on Nov 21, 2019 5:02 pm IST

నటసింహం బాలయ్య నటించిన తాజా చిత్రం ‘రూలర్’. సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సి కళ్యాణ్ నిర్మించారు. కాగా నేడు ఈమూవీ టీజర్ విడుదలైంది. ధర్మ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య మరో మారు వీరవిహారం చేయనున్నాడని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. పోలీస్ గా మరియు బిజినెస్ మాన్ గా రెండు భిన్న పాత్రలలో బాలకృష్ణ కనిపించడం విశేషం. రూలర్ సినిమాలో యాక్షన్ పాళ్ళు కూసింత ఎక్కువే అని తెలుస్తుంది. వేదిక, సోనాల్ ల గ్లామర్, సప్తగిరి, ధన్ రాజ్ ల కామెడీ తో ఎంటర్టైనింగ్ అంశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఇక హీరోయిన్ భూమిక ఈ మూవీలో కీలక రోల్ చేస్తుండగా ప్రకాష్ రాజ్, జయసుధ, సాయాజీ షిండే ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇలా అన్ని కమర్షియల్ అంశాలు కలిసి ఫుల్ ప్యాక్డ్ మూవీగా రూలర్ ఉంటుందని అర్థం అవుతుంది. వచ్చే నెల 20న క్రిస్మస్ కానుకగా రూలర్ విడుదల అవుతుంది. చిరంతన్ భట్ రూలర్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More