స్టార్ హీరోయిన్స్ కి మించి శ్రీముఖి పారితోషికం…?

Published on Jul 30, 2019 11:09 am IST

ఒకరి ఎంట్రీ, మరొకరి ఎగ్జిట్ తో బిగ్ బాస్ షో ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన 15మంది సెలెబ్రిటీస్ లో మొదటివారం ఎలిమేషన్ కొరకు ఆరుగురు నామినేట్ కాగా వారిలో సీనియర్ నటి హేమ ఎలిమినేట్ అయ్యి షో నుండి బయటకి రావడం జరిగింది. ఈమె స్థానంలో ఆసక్తికరంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ట్రాన్స్ జెండర్ తమన్నా ప్రవేశించి షోని ఆసక్తికరంగా మార్చింది. ఈమె సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసిన మొదటి ట్రాన్స్ జెండర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఐతే ఇంటి సభ్యులలో ఒకరైన యాంకర్ శ్రీముఖి రెమ్యూనరేషన్ పై ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తుంది. శ్రీముఖికి బిగ్ బాస్ నిర్వాహకులు ఈ షోలో నటింప చేయడానికి ఏకంగా 3.5 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని సమాచారం. బిగ్ షోకి మంచి ఆదరణ దక్కాలంటే బాగా తెలిసిన సెలెబ్రిటీలు చాలా అవసరం. ప్రస్తుతం శ్రీముఖి ‘పటాస్’ వంటి షోలతో పాటు,అడపాదడపా చిత్రాలలో నటిస్తూ ప్రముఖ యాంకర్లలో ఒకరిగా ఉన్నారు. ఆమె పాపులారిటీ దృష్ట్యా ఆమెకు ఇంత పెద్ద మొత్తంలో ముట్ట చెబుతున్నారని సమాచారం.

స్టార్ హీరోయిన్స్ సైతం టాలీవుడ్ లో 2కోట్లకు మించి పారితోషకం తీసుకోవడం లేదు. అలాంటిది 100రోజుల షో కొరకు ఇంత భారీ అమౌంట్ ని ఆమె అందుకుంటున్నారన్న వార్త అందరిని విస్మయానికి గురిచేస్తుంది. ఈ లెక్కన ఆమె చివరివరకు షోలో కొనసాగినా కూడా రోజుకు 3.5లక్షలు చెల్లిస్తున్నారని అర్థం. ఐతే మరి ఈ వార్తలో ఎంత వరకు వాస్తవికత ఉందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :