రిసల్ట్ చూడకుండానే నాగ్ రివార్డ్ ఇస్తున్నాడా?

Published on Jul 26, 2019 7:30 pm IST

నటుడు రాహుల్ రవీంద్ర సుశాంత్ హీరోగా వచ్చిన చిలసౌ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఇక ఆయన తెరకెక్కించిన మన్మధుడు 2 ఇంకొద్ది రోజులలో విడుదల కానుంది. నిన్న విడుదలైన ట్రైలర్ కూడా కామెడీ,రొమాన్స్,ఎమోషన్ అన్ని అంశాలతో ఆసక్తికరంగా ఉంది. ఐతే రెండు రోజులుగా సామాజిక మాధ్యమాలతో పాటు,కొన్ని మీడియా చానల్స్ లో ఓ వార్త ప్రముఖంగా ప్రచారం అవుతుంది.

నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా ఓ ముల్టీస్టారర్ తీయాలనుకుంటున్న కింగ్ నాగార్జున ఆ బాధ్యతను రాహుల్ రావేంద్ర కు అప్పగించాలని భావిస్తున్నాడట. అక్కినేని వారసుల మల్టీ స్టారర్ చిత్రానికి దర్శకత్వం వహించమని నాగార్జున రాహుల్ ని కోరారట. ఐతే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

చిత్ర పరిశ్రమలో ప్రతిభకు విజయాలే కొలమానం. టాలెంట్ వలన కావచ్చు,లక్ వలన కావచ్చు హిట్ కొట్టినవారికే అవకాశాలు దక్కుతాయి. అలాంటిది దర్శకుడిగా ఒక్క విజయాన్ని కూడా అందుకోని రాహుల్ కి ఎంత పెద్ద బాధ్యత నాగ్ అప్పగిస్తారా అనేదే అసలు ప్రశ్న. మన్మధుడు 2 మూవీ ఫలితం తరువాత ఇలాంటి వార్తలు వచ్చినా నమ్మే అవకాశం ఉంటుంది. కానీ నాగ్ యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించడంలో ముందుంటారు. గతంలో ఆయన కొత్త దర్శకులకు,మ్యూజిక్ డైరెక్టర్స్ కి తన చిత్రాలకు పనిచేసే అవకాశం కల్పించారు. ఏది ఏమైనా ఈ పుకారులో ఉన్న వాస్తవం తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :