సైరా పై గుప్పుమన్న పుకార్లు

Published on Aug 29, 2019 8:25 pm IST

ప్రతిష్టాత్మక సైరా మూవీ విడుదల వాయిదా పడనుందంటూ ఇండస్ట్రీలో పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ మూవీ వార్ అంటూ చర్చ నడుస్తుంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన యాష్ రాజ్ ఫిలిమ్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో వార్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర విడుదల తేదీగా అక్టోబర్ 2గా ప్రకటించడం జరిగింది.

నిజానికి సైరా మూవీ విడుదల తేదీ అక్టోబర్ 2 గా చాలా రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. ఐతే వార్ చిత్ర యూనిట్ కూడా అదే తేదీని ప్రకటించడం వలన సైరా చిత్రానికి థియేటర్ల సమస్య తలెత్తే ప్రమాదం ఏర్పడింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా లాంటి చిత్రానికి సరిపడా థియేటర్స్ లభించకపోతే ఆ ప్రభావం ఓపెనింగ్స్ పై పడుతుంది. అందుకే సైరా ఒక వారం వాయిదా వేసి అక్టోబర్ 8న విడుదల చేయడం మంచిదని హిందీ డిస్ట్రిబ్యూటర్స్ వాదనట. మరి రామ్ చరణ్, చిరంజీవి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :