ఓ బేబీ హిట్ తరువాత సమంతపై పుకార్లు.

Published on Jul 28, 2019 1:01 am IST

టాలీవుడ్ లక్కీ లేడీ సమంత “ఓ బేబీ” మూవీతో సోలో హిట్ కొట్టింది. తెలుగు రాష్ట్రాలలో రికార్డు వసూళ్లు సాధించిన ఓ బేబీ చిత్రం, యూఎస్ లో దుమ్మురేపింది. అక్కడ ఏకంగా వన్ మిలియన్ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. నిజానికి యూఎస్ లో వన్ మిలియన్ మార్క్ సాధించడం అనేది స్టార్ హీరోలకు మినహా, ఒక రేంజ్ హీరోలకు సాధ్యం కాని విషయం. అలాంటిది సమంత స్టార్ హీరోలెవరు లేకపోయినా ఆ మార్క్ సాధించి చూపింది. ఇప్పటి వరకు ఈ ఫీట్ అందుకున్న మొట్టమొదటి లేడీ ఓరియెంట్ మూవీ ఓ బేబీ కావడం విశేషం.

ఐతే ఈ మూవీ తరువాత సమంత భారీగా పారితోషకాన్ని పెంచేసిందని కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తున్న పుకారు. సమంత తన పారితోషకాన్ని గతంలో తీసుకున్న దానికంటే ఒక కోటి మేర ఎక్కువ డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, కొన్ని మాధ్యమాల్లో ప్రముఖంగా ప్రచురిస్తున్నారు. సౌత్ లో నయనతార హీరోయిన్స్ అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :