‘లూసిఫర్’ సిస్టర్ పై అవన్నీ రుమార్సే !

Published on Jul 6, 2020 12:41 pm IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులోకి మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో మంజు వార్యర్ పాత్ర కూడా కీలకమైనది. హీరోకి చెల్లి పాత్ర అయిన ఈ పాత్రలో మంజు వార్యర్ అద్భుతంగా నటించింది. హీరో పై ద్వేషంతో ఆవేశంతో రగిలిపోతూ.. చివరికి హీరో సాయం కోరే ఆ ఎమోషనల్ రోల్ లో రోజా నటించబోతున్నట్లు, లేదూ కుష్బూ చేస్తోందని, కొన్ని రోజులు అయితే ఏకంగా విజయశాంతినే చేస్తోందని, మధ్యలో సుహాసిని కూడా చేస్తోందని ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి.

కానీ వీటిలో ఏ ఒక్కటి నిజం కాదని తెలిసింది. ఇంకా ఆ క్యారెక్టర్ కి ఎవర్నీ ఫైనల్ చేయలేదు. ఇక తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో కొన్ని కీలకమైన మార్పులు చేశారని.. ముఖ్యంగా హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సన్నివేశాలు సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలిచేలా సుజిత్ ప్లాన్ చేస్తున్నాడట. అలాగే మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయట. మెగాస్టార్ చిరంజీవి సుజీత్ టాలెంట్ పై నమ్మకముంచి అతనికి ఈ భారీ సినిమా అవకాశం ఇచ్చారు. మరి ఈ మెగా ఛాన్స్ ను సుజీత్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More