
రన్ రాజా రన్ అనే యాక్షన్ కామెడి సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. మిర్చి సినిమాను నిర్మించిన వంశీ, పృథ్విలు నిర్మాతలు. శీరత్ కపూర్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయంకానుంది. సుజీత్ దర్శకుడు
ఈరోజు ఈ సినిమా అఫీషియల్ టీజర్ ని విడుదలచేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా మాదీ సినిమాటోగ్రఫీ, ఘిబ్రన్ సంగీతానికి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాలో శర్వా ఒక దొంగ పాత్ర పోషిస్తున్నాడు
హైదరాబాద్, గోవాలలో ఈ సినిమాను తీసారు. సుజీత్ గతంలో కొన్ని లఘు చిత్రాలు తీసాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముగించుకుని నిర్మాణాంతర దశలోవుంది

