హిట్ డైరెక్టర్ కి ఇంకా సినిమా లేనట్లే !

హిట్ డైరెక్టర్ కి ఇంకా సినిమా లేనట్లే !

Published on May 11, 2019 9:20 AM IST

అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో సమంత – నాగచైతన్య జంటగా కాప్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమా రాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా లేదట. ప్రతుతం చైతు వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నాడు. చైతు వెంకీమామ తరువాత, మేర్లపాక గాంధీ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అలాగే ఓన్ బ్యానర్ లో రామరాజు అనే సినిమా ఉంది.

మొత్తానికి చైతు, అజ‌య్ భూప‌తితో సినిమా చెయ్యనట్లే. “ఆర్ఎక్స్ 100” లాంటి బోల్డ్ సినిమాతో సంచలన విజయం సాధించినా.. అజ‌య్ భూప‌తి రెండో సినిమా కోసం మాత్రం బాగానే కష్టపడుతున్నాడు. అయినప్పటికీ అజయ్ కి మాత్రం సినిమా సెట్ కావట్లేదు. ఒక సినిమా హిట్ అయిందంటే ఇక ఆ డైరెక్టర్ చుట్టూ అవకాశాలు క్యూ కడతాయి. ఎందుకో అజయ్ విషయంలో ఇలా జరగలేదు. ప్రస్తుతం అజయ్ క్రైమ్ నేపథ్యంలో సాగే సినిమా కోసమా స్క్రిప్ట్ రాస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు