అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ‘ఆర్ఎక్స్ 100’

అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ‘ఆర్ఎక్స్ 100’

Published on Jul 16, 2018 8:38 PM IST

ట్రైలర్ తో ఎంత ఆసక్తిని క్రియేట్ చేసిందో సినిమా విడుదలైన తరువాత కూడా కలెక్షన్స్ తో అంతే సెన్సేషన్ ను సృష్టిస్తుంది ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం. నూతన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 12 న విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఆ ప్రభావం కలెక్షన్స్ ఫై మాత్రం పడలేదు. ప్రధానంగా యువత ఈ సినిమా చూడడానికి ఇష్టపడుతుండడం తో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.
ఈ చిత్రం యొక్క 4రోజుల కలెక్షన్స్ వివరాలు :

 

 

ఏరియా  కలెక్షన్స్
నైజాం  2,42,10,653
సీడెడ్  58,75,410
నెల్లూరు  10,58,161
గుంటూరు  36,46,663
కృష్ణ 34,86,838
పశ్చిమ గోదావరి  31,54,193
తూర్పు గోదావరి  42,53,309
ఉత్తరాంధ్ర  61,19,595
రెండు తెలుగు రాష్ట్రల్లో నాలుగు రోజులకుగాను మొత్తం షేర్ 5,18,04,822

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు