ఆర్ఎక్స్ 100 హీరో మరో చిత్రానికి ఓకే చెప్పాడు !

Published on Oct 16, 2018 8:45 am IST


ఆర్ఎక్స్ 100 రూపంలో తోలి సినిమాతోనే సెన్సషనల్ హిట్ కొట్టిన యువ హీరో కార్తికేయ ప్రస్తుతం ద్విభాష చిత్రం ‘హిప్పీ’ లో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ పతాకం ఫై కలై పులి ఎస్ తాను నిర్మిస్తున్నాడు. అలా సెకండ్ సినిమాతోనే బడా నిర్మాణ సంస్థ లో ఛాన్స్ కొట్టేసిన కార్తికేయ ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

అయితే ఈ సారి స్ట్రెయిట్ తెలుగు సినిమాకు ఓకే చెప్పాడు. ‘జయజానకి నాయక’ చిత్రాన్ని నిర్మించిన ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇక ఈచిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :