ఆర్ఎక్స్ 100 హీరో కొత్త చిత్రం టైటిల్ రేపు రివీల్ కానుంది !

ఆర్ఎక్స్ 100 హీరో కొత్త చిత్రం టైటిల్ రేపు రివీల్ కానుంది !

Published on Apr 25, 2019 3:42 PM IST

మొదటి చిత్రం ఆర్ఎక్స్100 తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో కార్తికేయ ఇటీవల తన రెండవ చిత్రం హిప్పీ షూటింగ్ ను పూర్తి చేశాడు. జూన్ 7న ఈ చిత్రం విడుదలకానుంది. ఇక ప్రస్తుతం ఈ హీరో తన మూడవ చిత్రంలో నటిస్తున్నాడు. వాస్తవిక సంఘటనల ఆధారంగా నూతన దర్శకుడు అర్జున్‌ జంధ్యాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను కంప్లీట్ చేసింది.

జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈచిత్రం యొక్క టైటిల్ రేపు మధ్యాన్నం 12:06 గంటలకు రివీల్ కానుంది. మరి మొదటి ,రెండు చిత్రాల టైటిళ్ల మాదిరిగానే ఈ చిత్రం యొక్క టైటిల్ కూడా డిఫ్రెంట్ గా ఉంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు