నైజాంలో చైతూ సినిమాపై కరెన్సీ బ్యాన్ ఎఫెక్ట్ లేదా?
Published on Nov 14, 2016 5:40 pm IST

Sahasem-savasaga-sagipo
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ అన్న సినిమా గత శుక్రవారం పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. రొమాన్స్ జానర్లో ‘ఏమాయ చేశావే’ లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ – చైతూల కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ సినిమాపై టీజర్ విడుదలైనప్పట్నుంచే ఎక్కడిలేని అంచనాలు బయలుదేరాయి. ఇక ఆ అంచనాల మధ్యనే విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

కాగా భారత ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో భారీగా డబ్బు కొరత ఏర్పడి ప్రజలంతా సినిమాలకు దూరమయ్యే పరిస్థితి కలిగింది. దీంతో ఈ ప్రభావం ‘సాహసం శ్వాసగా సాగిపో’ కలెక్షన్స్‌పై కూడా పడింది. అయినప్పటికీ నైజాం ప్రాంతంలో మాత్రం ఈ సినిమా మంచి కలెక్షన్స్‌నే సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. ఎక్కువగా ఆన్‌లైన్ టికెట్ అమ్మకాలు ఉండే ఈ ప్రాంతంలో మూడు రోజుల్లో ఈ సినిమా 2 కోట్ల 03 లక్షల రూపాయలు వసూలు చేసింది. అయితే ఇతర ప్రాంతాల్లో మాత్రం కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవు.

 
Like us on Facebook