చెన్నైలో సాహో రికార్డు కలెక్షన్స్ .

Published on Aug 31, 2019 8:40 am IST

ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ నిన్న విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. ఐతే కలెక్షన్స్ పరంగా సాహో సాలిడ్ గా దూసుకెళుతుందని తెలుస్తుంది. చెన్నై సిటీలో సాహో తమిళ్, తెలుగు, హిందీ భాషలలో కలిపి మొత్తం 73లక్షల గ్రాస్ సాధించింది. ఇక ఒక్క తెలుగు వర్షన్ మాత్రమే 32లక్షల గ్రాస్ వసూళ్లతో అల్ టైం తెలుగు హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటివరకు మహేష్ భరత్ అనే నేను మూవీ పేరిట ఉన్న 27లక్షల రికార్డు ని ఈ చిత్రం అధిగమించింది.

ఇక ఓవర్ అల్ గా తమిళ నాడు రాష్ట్రంలో మూడు భాషలకు గాను మొదటి రోజు సాహో దాదాపు 4కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుంది. ఇంకా శని, ఆదివారాలైన వారంత దినములతో పాటు, సోమవారం వినాయక చవితి కలిసిరావడంతో సాహో మంచి కలెక్షన్స్ సాధించే అవకాశం కలదు. చూద్దాం వీకెండ్ ముగిసే నాటికి సాహో ఏమేర వసూళ్లు సాధిస్తుందో.

సంబంధిత సమాచారం :

More