బాలీవుడ్ మతిపోగొడుతున్న సాహో…!

Published on Aug 26, 2019 11:43 am IST

ప్రస్తుతం దేశం మొత్తం సాహో మేనియాతో ఊగిపోతోంది. దేశంలోని అన్ని ప్రధాన చిత్ర పరిశ్రమలలో సాహో గురించే మాట్లాడుకుంటున్నారు. ఏ ఇద్దరు మూవీ ప్రేమికులు కలిసినా సాహో గురించే చెప్పుకుంటున్నారు. అంతలా సాహో ఫీవర్ దేశాన్ని పట్టిపీడిస్తోంది. సాహోకి వస్తున్న ఈస్పందన బాలీవుడ్ బడా హీరోలను బెంబేలెత్తిస్తోంది.

అసలు ఒక ప్రాంతీయ హీరో సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి కారణమేంటని వారు తలలు పట్టుకుంటున్నారు. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కుతున్నా వాటికి దేశవ్యాప్తంగా ఇంత హైప్ రాకపోవడం గమనార్హం. అమీర్, సల్మాన్ వంటి స్టార్ హీరోల సినిమాలకు నార్త్ మినహా ఇస్తే, సౌత్ లో అంతగా ప్రచారం దక్కడం లేదు. ప్రస్తుతం రణ్వీర్ కపూర్, అమితాబ్, అలియా భట్ ప్రధానపాత్రలలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్ర చిత్రం గురించి ఎంత మందికి తెలుసు…? కానీ సాహో మాత్రం చిత్రీకరణ దశ నుండి దేశవ్యాప్తంగా వార్తలలో ఉంటూ వచ్చింది.

గతంలో అమీర్ ఖాన్, కత్రినా, అమితాబ్ వంటి స్టార్ కాస్ట్ తో వచ్చిన భారీ బడ్జెట్ తెరకెక్కిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కి కూడా అనుకున్నంత ప్రచారం దక్కలేదు. కానీ సాహో విషయంలో మాత్రం ఇంత ప్రచారం కలగడం వారిని ఒకింత ఈర్ష్య పడేలా చేస్తుంది. అలాగే సైరా, ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రాలు కూడా దేశవ్యాప్తంగా మంచి ప్రచారం దక్కించుకుంటున్నాయి.

సంబంధిత సమాచారం :