సూపర్ స్టైలిష్ గా “సాహో” విలన్ లుక్…!

Published on Aug 5, 2019 1:52 pm IST

మోస్ట్ అవైటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సాహో” ఇంకా కొద్దిరోజులలో విడుదల కానుంది. ప్రభాస్,శ్రద్దా కపూర్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు,హిందీ,తమిళం మరియు మళయాళంతో కలిపి మొత్తం నాలుగు భాషలలో భారీగా విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న “సాహో” ప్రొమోషన్స్ కూడా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పటికే “సాహో” విడుదలతో అనేక చిత్రాలు తమ విడుదల తేదీలను వాయిదా వేసుకోవడం గమనార్హం.

కాగా నేడు ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్ర చేస్తున్న నీల్ నితిన్ ముకేశ్ లుక్ ని చిత్ర బృందం విడుదల చేశారు. ఆ పోస్టర్లో నీల్ నితిన్ గ్లాసెస్ పెట్టుకొని,బీయర్డ్ ఫేసుతో సూపర్ సైలిష్ గా ఉన్నాడు. నితిన్ లుక్ చూస్తుంటే ప్రభాస్ లాంటి సూపర్ హీరోకి పోటీ ఇవ్వాలంటే ఆ మాత్రం ఉండాలన్నట్టుంది. “సాహో” ప్రధాన విలన్ నీల్ నితిన్ కి,ప్రభాస్ సి మధ్య నడిచే మైండ్ గేమ్ సన్నివేశాలతో పాటు, యాక్షన్ సన్నివేశాలు కూడా ఓ రేంజ్ లో ఉంటాయని సమాచారం. తాజాగా విడుదలైన “సాహో” విలన్ లుక్ తో చిత్రం పై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి అనడంలో సందేహం లేదు.

యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, జాకీ ష్రాఫ్,ఎవ్లీన్ శర్మ,చుంకీ పాండే,మురళి శర్మ,వెన్నెల కిషోర్ వంటి నటులు ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. ఈనెల 30న భారీగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :