అక్కడ సాహో ఒక రోజు ముందే…!

Published on Aug 28, 2019 7:02 am IST

దుబాయ్ ప్రేక్షకులకు సాహో టీమ్ స్వీట్ గిఫ్ట్ ఇచ్చారు. అదేంటంటే అక్కడ సాహో ఒక రోజు ముందే ప్రదర్శించనున్నారు. సాహో హిందీ వర్షన్ ఐమాక్స్ ఫార్మాట్ లో రేపు సాయంత్రం 8:30 షో వేయనున్నారు. అంటే దుబాయిలో సాహో ఇండియా కంటే ఓరోజు ముందే దిగుతాయాడన్న మాట.

ఇక యూఎస్ లో కూడా సాహో భారీ ఎత్తున విడుదల అవుతుంది. ఒక్క తెలుగు వర్షన్ మాత్రమే 250లొకేషన్స్ లో విడుదల అవుతుండగా, తమిళ్ వర్షన్ 140 చోట్ల విడుదల చేస్తున్నారు. మిగిలిన హిందీ, కన్నడ వర్షన్స్ కలుపుకుంటే ఈ సంఖ్య వెయ్యి వరకు ఉండొచ్చని అంచనా.

సంబంధిత సమాచారం :