ఆ రెండు చోట్లా బాహుబలి 2ని దాటేసిన సాహో

Published on Aug 31, 2019 12:12 pm IST

టాక్ తో సంబంధం లేకుండా సాహో ప్రభాస్ కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ సృష్టిస్తుంది. ప్రభాస్ స్టామినాను తెలియజేస్తూ మొదటి రోజు సాహో కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు సాధించగా, మరి కొన్ని చోట్ల బాహుబలి రికార్డు ను కూడా దాటివేసింది. ముఖ్యంగా నైజాం ,నెల్లూరు ఏరియాలలో సాహో బాహుబలి 2 వసూళ్లను అధిగమించి అల్ టైం రికార్డు గా నిలిచింది.

బాహుబలి నైజాంలో 8.9 కోట్ల మొదటి రోజు షేర్ సాధించగా, సాహో 9.4 కోట్ల షేర్ సాధించి బాహుబలి 2ని అధిగమించింది. అలాగే నెల్లూరు లో బాహుబలి 2 పేరిట ఉన్న 2.10 కోట్ల మొదటి రోజు షేర్ ని అధిగమించి 2.56 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తుంది. దీనితో తెలుగు రాష్ట్రాలలో రెండు చోట్ల సాహో బాహుబలి 2 అల్ టైం రికార్డ్స్ ని బద్దలు కొట్టింది.

సంబంధిత సమాచారం :