వైరల్ అవుతున్న “సాహో” సాలిడ్ పోస్టర్.!

Published on Jul 23, 2021 9:00 am IST


బాహుబలి లాంటి ఇండియన్ ఇండస్ట్రీ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి ఎలాంటి సినిమా అనౌన్స్ అవ్వుద్దా అన్న సమయంలో అనౌన్స్ కాబడిన భారీ చిత్రమే “సాహో”. ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పటికి ఇండియా లోనే భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. మరి అదే క్రమంలో విడుదలై డివైడ్ టాక్ తో కూడా బాక్సాఫీస్ ని కొల్లగొట్టింది.

అయితే అప్పట్లో పోస్టర్స్ తో కూడా మంచి హైప్ ని తెచ్చుకున్నా ఈ చిత్రం నుంచి ఇప్పుడు ఓ సాలిడ్ పోస్టర్ బయటకి వచ్చి వైరల్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అంతా రాధే శ్యామ్ పోస్టర్స్ అండ్ అప్డేట్ కోసం ఇది బయటకి రావడం కాస్త ఊరట ఇచ్చింది. అలాగే ఇలాంటి ఆసక్తికర పోస్టర్ ని అప్పుడు రిలీజ్ చెయ్యలేదా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను ఈ పోస్టర్ ఇపుడు షేక్ చేస్తుంది.

సంబంధిత సమాచారం :