బండ్ల గణేష్ పై 14 కేసులు పెట్టానంటున్న హీరో !
Published on Mar 27, 2017 2:30 pm IST


టాలీవుడ్లోని పెద్ద నిర్మాతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్, హీరో సచిన్ జోషిల మధ్య మరోసారి వివాదం రేగింది. ఈరోజు మీడియాతో మాట్లాడిన సచిన్ గణేష్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ్డారు. బండ్ల గణేష్ పెద్ద ఇడియట్ అనిన సచిన్ గణేష్ పై 14 చెక్ బౌన్స్ కేసులున్నాయని, అన్నీ లీగల్ కేసులేనని అన్నారు. అలాగే బండ్ల తండ్రి తన వద్దకు వచ్చి కన్నీరు పెట్టుకోవడంతో అతన్ని జైలుకు పంపంకుండా వదిలానని కూడా తెలిపారు. సచిన్ చేసిన ఈ వ్యాఖ్యలతో వీరి గొడవ మరోసారి లైమ్ లైట్లోకి వచ్చింది.

‘నీ జతగా నేనుండాలి’ చిత్రం కోసం చేతులు కలిపిన ఈ ఇద్దరూ ఆ సినిమా విడుదలై పరాజయం కావడంతో వచ్చిన ఆర్ధిక లావాదేవీల విభేదాలు కారణంగా దూరమయ్యారు. బండ్ల సినిమా కోసం తన వద్దే డబ్బు తీసుకుని తనను మోసం చేసాడని సచిన్ ఆరోపించగా, ఆ డబ్బు తనదేనని, సచిన్ తో సినిమా తీయడం వలన చాలా నష్టపోయానని బండ్ల గణేష్ ప్రత్యారోపణ చేశారు. ఈ నైపథ్యంలో వీరిరువురు పలుమార్లు మాటల యుద్దానికి కూడా దిగారు.

 
Like us on Facebook